Pakistan SCO Meeting: పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్‌సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
Rajnath Singh holds talks with Chinese defence minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్…
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.