తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపూరి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కులవివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేసి బోధన ..దీంతో కుల వివక్షతకు ఆజ్యం పోసిన మండల విద్యాశాఖ అధికారులు. గ్రామ పంచాయితీ సర్పంచ్ సూచనలు మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ ఆరోపణలు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాలకు తాళం వేశారు. దీంతో పాఠశాల ముందే విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బోడ్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ సమయపాలన పాటించడం లేదు. పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం, చదువులు సరిగా బోధించకపోవడం, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు…
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్‌లో రిస్క్ లేకుండా జీవించవచ్చు. చదువుకున్న అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే లేదని చెప్పాలి. వచ్చిన ఉద్యోగాలతో ప్రస్తుతం ఉన్న లైఫ్ ను లీడ్ చేయగలమా అంటే చెప్పలేము. మధ్యలో కరోనా లాంటి మహమ్మారులు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. కొంతమంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు. కొందరు చదువును మద్యలో వదిలేసి ఉంటారు. అలాంటి వారిలో కొందరు ప్రపంచాన్ని ఏలిన వాళ్లు కోకల్లుగా ఉన్నారు. అలాంటి…
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము, ఇక నుండి ఆఫ్ లైన్ లో తరగతులు ఉంటాయి. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడందుకుంది. కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ ట్రెండ్ అన్ని దేశాలలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగునంగా 50 కి పైగా దేశాలలో ఇప్పటికే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. తెరుచుకుంటున్న బడి తలుపులు దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. అన్ని రంగాలపై అది తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా ఒకటి.…
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్‌లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్‌లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి…
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలో ఉన్న సెంట్రల్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు ఎంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంటో చైనాలో ఇలాంటి మరణాలు వరసగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు.
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. విద్యాలయాలు కరోనా వ్యాప్తికి కారణమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్ళీ రాదనే గ్యారెంటీ లేకపోవడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటె, స్పెయిన్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉన్నదో చూశాం. గతంలో ఆ దేశంలో పెద్ద…