మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ఎస్ బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం…