ఓ సీరియల్ హీరో, ఈయన పేరు చందన్ కుమార్. తాజాగా తెలుగులో శ్రీమతి శ్రీనివాస్ సీరియల్‌లో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ ధారావాహిక షూటింగ్ సందర్భంగా హీరో ఓవరాక్షన్ చేశాడు. నానా రభస చేయడమే కాకుండా.. షూటింగ్ వర్క్ చేస్తున్నటువంటి క్రూను నానాబూతులు తిట్టాడు. హీరో అంటే రౌడీలా ప్రవర్తించడం అనుకున్నట్టున్నాడు బాబు. అక్కడ పనిచేస్తున్న టెక్నిషియన్‌పై నోరుపారేసుకుని వీరలెవెల్లో పోజులిచ్చాడు హీరో గారు.. మన దగ్గరికి వచ్చి పని చేసుకుంటూ మన వాళ్లనే తిడితే ఊరుకుంటామా?…