Rahul Gandhi life threat: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పూణేలోని ప్రత్యేక కోర్టుకు హాజరైన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్‌పై తాను చేసిన ప్రకటన కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. బహిరంగంగా ఇద్దరు నాయకులు తనను బెదిరించారని రాహుల్ తెలిపారు. తాను కోర్టుకు హాజరైన సమయంలో అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు. READ MORE: CM Chandrababu: పులివెందుల రీపోలింగ్‌పై…
Rahul Gandhi: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.