Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
AAP’s Satyendar Jain caught on cam getting massage in Tihar jail: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో ఇరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. మసాజ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్…
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోల్ కతాకు చెందిన ఓ సంస్థకు సంబంధించిన హవాలా లావాదేవీల్లో ఢిల్లీ ఆరోగ్య, హోం మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన నివాసంతో పాటు అతని సహాయకుడి నివాసంలో మంగళవారం ఈడీ భారీ ఎత్తున సోదాాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారం, నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మొత్తం రూ.…
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్,…
మనీలాండరింగ్ , హవాలా కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దూకుడు పెంచింది. కోల్ కతాకు చెందిన కంపెనీకి హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై ఆప్ పార్టీ భగ్గుమంది. కేంద్రం కావాలనే విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కావాలనే మా పార్టీకి చెందిన మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.…