Ayesha Meera Case: సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు చేపట్టారు.. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపిన సత్యంబాబు.. నిర్దోషిగా బయటకు వచ్చాడు.. దీంతో కోర్టు తేల్చడంతో.. మరోసారి దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ.
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషి అని 2017లో ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని వివరించి తనకు రెండు ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారంతో పాటు ఇల్లు ఇవ�