‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత నుంచీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ శాతం స్టార్ హీరోస్ తో భారీ చిత్రాలే రూపొందాయి. అడపా దడపా ‘పదహారేళ్ళ వయసు’, ‘నిండునూరేళ్ళు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. అలా రాఘవేంద్రరావు రూపొందించిన ‘సత్యభామ’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘మౌనగీతంగల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసరసా మూవీస్ పతాకంపై కె.సారథి ‘సత్యభామ’ను నిర్మించారు. ‘సత్యభామ’ కథను చూస్తే – పెళ్ళయి ఏడేళ్ళు పూర్తయిన ఏ…