Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
బీహార్‌లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.