సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి’ 1978లో వెలుగు చూసింది. ఇలా పలుమార్లు సతీసావిత్రి కథ తెలుగువారిని పలకరించింది. 1957 జనవరి 12న విడుదలైన ‘సతీ సావిత్రి’లో యస్.వరలక్ష్మి సావిత్రిగా,…