వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తమిళ పాలిటిక్స్‌లో నెచ్చెలి శశికళ యాక్టివ్ అయ్యారు. చిన్నమ్మ సరికొత్త రాజకీయ ఆట షురూ చేశారు. ఇప్పటికే ఎన్డీఏ నుంచి పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ తదితరలంతా బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో కీలకమైన సీనియర్ నేత, మాజీ మంత్రి సెంగోట్టయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామికి డెడ్‌లైన్ విధించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
పార్టీకి దూరమైన పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ సహా ఇతర నాయకులను కలుపుకుని పోవడానికి పళనిస్వామికి ఇష్టం లేదని.. ఇది జయలలిత ఆశయాలకు విరుద్ధం అని చెప్పారు. అందరిని కలుపుకుని వెళ్లాలని.. అలా కాదని వెళ్తే జయలలిత ఆశయాలు సాధించలేమని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని.. బహిష్కరించిన నాయకులను 10 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జయలలిత మరణం తర్వాత పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. అన్నాడీఎంకే విడిపోకుండా ఉండటానికి తాను అనేక త్యాగాలు చేసినట్లు గుర్తుచేశారు. పార్టీకి పునర్ వైభవం రావాలంటే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని సూచించారు. అందరూ జయలలిత ఆశయాల కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంజీఆర్, జయలలితతో సెంగోట్టయన్ పనిచేశారు. దాదాపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య