జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా…