ఐడియాలాజికల్ సినిమాలు చేసే పా.రంజిత్ తన మార్క్ మూవీస్ నుంచి కాస్త పక్కకి వచ్చి చేసిన మూవీ ‘సార్పట్ట పరంబరై’. ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ నార్త్ చెన్నై ప్రాంతంలో 80’ల కాలంలో జరిగే బాక్సింగ్ కథతో తెరకెక్కింది. వారసత్వంగా బాక్సింగ్ ని పాటించే రెండు వర్గాల మధ్య పా.రంజిత్ రాసిన కథ కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా పా.రంజిత్ సార్పట్ట పరంబరై కథని సూర్య, కార్తిలకి రాసుకున్నాడు కానీ ఈ ఇద్దరు హీరోలు బ్యాక్…
గత కొంత కాలంగా వివిధ భాషల్లో వస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను చూస్తుంటే మన వాళ్ళంతా మూస పంథాలో సాగిపోతున్నారనే భావన కలుగుతోంది. తీస్తే బయోపిక్స్ తీస్తున్నారు లేదా ఎవరైనా క్రీడాకారుడు తనకు జరిగిన అవమానాన్ని తన తర్వాత తరానికి శిక్షణ ఇచ్చి తద్వారా తన పగప్రతీకారాలను తీర్చుకున్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కాకపోతే తనకు క్రీడా మైదానంలో జరిగిన అన్యాయానికి తానే ఓ ఐదు, పదేళ్ళ తర్వాత తిరిగి గెలుపుతో బదులిచ్చిన…