సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు.…