Sarfaraz Khan Interview video: తొలి టెస్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో.. వారి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లకు బీసీసీఐ జట్టులో చోటిచ్చింది. అంతకంటే ముందు విరాట్ కోహ్లీ స్థానంలో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. రెండో టెస్టులో మిడిలార్డర్‌లో చోటు కోసం పాటిదార్‌తో సర్ఫరాజ్ పోటీపడ్డాడు. అయితే నేడు ఆరంభం అయిన విశాఖ టెస్టు తుది జట్టులో పాటిదార్‌కు స్థానం దక్కడంతో.. సర్ఫరాజ్‌కు నిరాశే ఎదురైంది. దాంతో…
IND vs ENG 2nd Test Prdicted Playing 11: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో మార్పులతో బరిలోకి దిగనుంది. ఉప్పల్ టెస్టులో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.…
Sarfaraz Khan earns maiden call-up from Team India: తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడ్డ భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా విశాఖలో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడకండరాలు పట్టేయగా.. రాహుల్ కుడి తొడ నొప్పితో బాధపడుతున్నాడు. ‘రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్‌లు ఫిబ్రవరి 2న విశాఖలో ఆరంభమయ్యే రెండో టెస్టుకు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్ లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.