Sarfaraz Khan surpasses Shubman Gill: దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదగా అతడు టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత…