తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా…