క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శనివారం 2022 క్రిస్మస్ సందర్భంగా ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్ బీచ్‌లో శాంతా క్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇసుక కళతో పట్నాయక్ "మెర్రీ క్రిస్మస్" అని రాశారు.