డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్తను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి చితకొట్టారు. తీవ్ర గాయాలైన సదరు కార్యకర్త అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో…