Sankranti Rush: సంక్రాంతి పండుగ కోసం పట్టణాలు, నగరాల్లో ఉండే ప్రజలు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా ఊర్లకు ప్రయాణమయ్యారు. ఇలా ఊళ్లకు వెళ్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి.
AP Hotels House Full: ఏపీలో సంక్రాంతి సందడి స్టార్ట్ అయింది. పట్నం నుంచి ప్రజలు పల్లెబాట పట్టగా.. బస్సులు, రైళ్లు, కార్లు అన్నీ ఫుల్ అయ్యాయి. తమ వాహనాల్లో సొంతూరికి వెళ్తుండటంతో హైవేలపై వెహికిల్స్ రద్దీ దర్శనమిస్తోంది. ఆంధ్రాలో సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు.
Sankranti Rush : సాధారణంగా సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో పండుగను ఘనంగా జరుపుకోవడానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతుంటారు. అయితే, పండుగకు ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్నప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనుకునే నగరవాసుల ప్రయాణ కష్టాలు మాత్రం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోలిస్తే…
Special Trains : సంక్రాంతి సందర్భంగా నగరంలో పెరిగే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పండుగ సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, ఈసారి రైల్వే ప్రత్యేక హాల్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా సికింద్రాబాద్–లింగంపల్లి మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైటెక్‌సిటీలో ఆగవు. అయితే భారీ ప్రయాణికుల రద్దీని తగ్గించడమే కాకుండా, ఐటీ కారిడార్ పరిసరాల్లో నివసించే…
Sankranti 2023: హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారింది. సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకోవడానికి సొంత గ్రామాలకు లక్షలాది మంది తరలివెళ్లడంతో… జనారణ్యం బోసిపోయింది. ప్రజలు నగరాల నుంచి పల్లె బాట పట్టడంతో… ఆయా హైవేల్లోని టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. సొంత వాహనాల్లో సొంతూర్లకు వెళ్తుండటంతో…. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిలో పతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలు…
Sankranti 2023: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రోజువారీ సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా..సీట్లు, బెర్త్‌లు దొరక్కపోవడంతో కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి సుమారు 12 లక్షల మందికిపైగా…