సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సందడి మళ్ళీ మొదలైంది. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనం కావడంతో నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.…