గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం,…