పొలిటికల్ ఎంట్రీలోనే ఆయన ఎంపీ అయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి. గెలిచి రెండేళ్లయింది. అంతలోనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ గ్యాప్ వచ్చినట్టు టాక్. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏమా కథ? 2019లో ఎంపీగా గెలిచి రాజకీయ తెరపైకి వచ్చారు డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైద్యులు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేసి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఎంట్రీలోనే బంపర్ ఛాన్స్ కొట్టారని…