(అక్టోబర్ 4న నటి సంఘవి పుట్టినరోజు) అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. తమిళ, తెలుగు చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన సంఘవి మత్తుగాచూస్తూ ప్రేక్షకులపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. దాంతోనే తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. సంఘవి అసలు పేరు కావ్య రమేశ్. 1977 అక్టోబర్ 4న మైసూరులో జన్మించింది. ఆమె తండ్రి రమేశ్ ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్. మైసూర్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ప్రముఖ కన్నడ దర్శకులు…