అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది... దాబాల వద్ద మాటు వేస్తుంది...హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని.. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు.