Warangal: వరంగల్‌లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఖిలా వరంగల్ తూర్పు కోటలో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం సేవిస్తుండగా మాట మాట పెరగడంతో స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు.