ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు రావద్దని చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్‌కు చెప్పారని, అయినా కూడా ఆయన వినకుండా వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా కూడా పోలేదని, పుష్ప 2 సినిమా చూసే వెళ్తా అని బన్నీ పట్టుపట్టాడన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమన్నారు. పుష్ప 2 సినిమాకు 2 వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని, బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముందని మంత్రి కోమటిరెడ్డి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రాకతో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో…
పోలీసులు వద్దన్నా సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వెళ్లాడని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్‌ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని…
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
Addanki Dayakar : పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో ఐకాన్ స్టార్ అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి…