చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.
నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.
చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.