అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో.. బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది.
కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.