సినీ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ పగ బట్టి ఇండస్ట్రీలో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ నటుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.…
జాతీయ అవార్డు గ్రహీత, కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడు నవీన్‌తో బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు జెపి నగర్ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బైక్ ప్రమాదంలో విజయ్ మెదడు, కుడి తొడకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసియులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి…