జాతీయ అవార్డు గ్రహీత, కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడు నవీన్‌తో బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు జెపి నగర్ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బైక్ ప్రమాదంలో విజయ్ మెదడు, కుడి తొడకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసియులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం విజయ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయ్ 2015లో కన్నడ చిత్రం “నాను అవనాల్లా అవలుకు” చిత్రానికి గానూ జాతీయ అవార్డును అందుకున్నారు. సంజయ్ విజయ్, విజ్ఞన్, కృష్ణ తులసి, విలన్, వీట్ కలర్ మీడియం స్ట్రెంత్, కిల్లింగ్ వీరప్పన్, అల్లామా వంటి అనేక చిత్రాల్లో నటించాడు. సంచారి విజయ్ కన్నడలోనే కాదు చాలా తమిళ చిత్రాల్లో కూడా నటించారు.