Anurag Thakur: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత, రాష్ట్రమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ, కేంద్రమంత్రులు డీఎంకే పార్టీపై ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.