హిందీ చిత్రం ‘అంధాధున్’ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాస్ట్రో’ అని పేరు పెట్టగా, తమిళంలో ప్రశాంత్ తో ‘అందగన్’ పేరుతో ఆయన తండ్రి త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి ఆయనే దర్శక నిర్మాత. హిందీలో రాధికా ఆప్టే పాత్రను తమిళంలో ప్రియా ఆనంద్ చేస్తోంది. ఇక టబు పాత్రను సిమ్రాన్ పోషిస్తోంది. ఇందులో ఆమె భర్త పాత్రను సముతిర కని పోషిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిత్ర బృందం సముతిర కని బర్త్ డే వేడుకను నిర్వహించింది. దానికి సంబంధించిన ఫోటోలను హీరోయిన్ ప్రియా ఆనంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో సముతిర కని కీలక పాత్రలు పోషిస్తున్నాడు.