UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.