టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమె క్రిస్టియన్ కావడంతో ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిక్లరేషన్ సమర్పించింది. తాను అన్యమతస్థురాలైనప్పటికీ శ్రీవారిపై నమ్మకం ఉండటంతో దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో అధికారులు ఆమెను శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమాను రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ సినిమా యూనిట్‌తో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో…