జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. మూడేళ్ళ పాలనా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు. తాడేపల్లి పార్టీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడతారు. వీటికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు నిర్వహించనున్నారు. బలహీన వర్గాలకు ప్రభుత్వం…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…