Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కార్‌ని పేల్చేస్తామని, వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. ఈ బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు.
సల్మాన్ ఖాన్ ప్రాణాలకు మరోసారి బెదిరింపులు రాగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ ప్రాణాలకు కొత్త ప్రాణహాని వచ్చింది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. ముంబై ట్రాఫిక్ కంట్రోల్‌కి బెదిరింపు సందేశం పంపినట్లు ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మెసేజ్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపుతామని, సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు…