బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన…