ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…