Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.
కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల.…
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదని, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని, ఉద్యోగులంతా తమ వెనుకే…
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు... గొడవలను అరికట్టలేకపోతే... బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు.