రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,…
బీసీలను ఓటుబ్యాంకుగా భావించే పార్టీలకు భిన్నంగా 2019లో సీఎం జగన్ బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి కొత్త సంప్రదాయం నెలకొల్పారు. పేదలకు తాయిలాలు ఇవ్వడమే కాకుండా సీఎం జగన్ పాలనలో భాగం ఇచ్చారన్నారు సజ్జల. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎప్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తోంది. తొలి కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారు. బీసీల్లో ఆత్మస్థయిర్యం పెంచాం. ఈసారి 25మందిలో 70 శాతం మంది బడుగు, బలహీనవర్గాల వారే.…