బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు మార్చ్ 11 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్…