Sai Pallavi: "అరె... మన సాయిపల్లవికి ఏమైంది?... ఈ మధ్య ఆమె సినిమాలేవీ కనిపించడం లేదు..." అంటూ నటి, నర్తకి సాయిపల్లవి అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే, తెలుగులో 'విరాటపర్వం' తరువాత సాయిపల్లవి కనిపించలేదు. తమిళ చిత్రం 'గార్గి' సాయి పల్లవి తెరపై కనిపించిన చివరి చిత్రం.
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది. సాయిపల్లవి 1992…