సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా ఆమడ దూరం వెళుతుంటారు. కొందరు మాత్రం ధైర్యం చేసి వాటి పట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్‌పూర్ జిల్లాలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సహరన్‌పూర్‌లోని ముజఫరాబాద్ మండలంలోని బధేరి ఘోగు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడి ఓ ఇంటి గోడలు మరియు నేల నుంచి వరుసగా వింత శబ్దాలు వినిపించడంతో కంగారు…