ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు…