కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్గొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొని, ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను…