విజయనగరం జిల్లా శృంగవరపు కోట రాజకీయం సలసలకాగుతోందట. ఇక్కడ.. ఎవరు సొంతోళ్ళో... ఎవరు ప్రత్యర్థులో కూడా అర్ధంకానంత గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో... ఆ రాజకీయ వైరం సహజమేననుకున్నారు.