ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్‌టన్‌కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్…