Cyclone Montha: మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం.. ఇప్పుడు తుఫాన్ అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి.. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుఫాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూడీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు…