తూర్పు ఉక్రెయిన్ నగరమైన స్లోవియన్స్క్‌లోని నివాస ప్రాంతంపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో 8 మంది మరణించినట్లు తెలిపింది. రష్యాకు చెందిన ఏడు ఎస్-300 క్షిపణులు బఖ్‌ముట్ నగరానికి పశ్చిమాన ఉన్న స్లోవియన్స్క్‌పై దాడి చేశాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్‌పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడి